ETV Bharat / city

ప్రారంభాలు, పార్టీలకు చురకలతో సాగిన కేటీఆర్​ ఓరుగల్లు పర్యటన - ప్రారంభాలు, పార్టీలకు చురకలు... కేటీఆర్​ పర్యటనలో హైలెట్స్​

ముఖ్యమంత్రి కేసీఆర్​పై నోరుపారేసుకుంటున్న కొందరు విపక్ష నేతలపై తెరాస కార్యకర్తల తిరుగుబాటు తప్పదని మంత్రి కేటీఆర్​ హెచ్చరించారు. సీఎంను దుర్బాషలాడే వారిపై కేసులకూ వెనకాడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మే పార్టీకి సర్కార్‌ నియామకాలపై మాట్లాడే నైతికత లేదని ఘాటు విమర్శలు చేశారు. గ్రేటర్‌ వరంగల్‌లో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్​... రెండు వేల కోట్ల రూపాయలకుపైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

minister ktr visit in warangal
minister ktr visit in warangal
author img

By

Published : Apr 12, 2021, 10:07 PM IST

Updated : Apr 12, 2021, 10:40 PM IST

ప్రారంభాలు, పార్టీలకు చురకలతో సాగిన కేటీఆర్​ ఓరుగల్లు పర్యటన

గ్రేటర్ వరంగల్ ఎన్నికల ముంగిట పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.. వరంగల్‌లో సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ నుంచి నేరుగా కాజీపేట రాంపూర్‌కు చేరుకున్న మంత్రి.. నగరవాసులకు రోజూ స్వచ్ఛమైన నీరందించే అర్బన్‌ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1,589 కోట్ల రూపాయలతో 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ద్వారా తాగునీరు సరఫరా చేయనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని దూపకుంటలో 600 డబుల్ బెడ్రూం, దేశాయిపేటలో 200 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. ఎల్బీ నగర్‌లో షాదీఖానా, మండిబజార్‌లో హజ్ హౌస్​ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీపురంలో పండ్ల మార్కెట్​ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్​.. 24కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. గరీబ్ నగర్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ అనంతరం శివనగర్‌లో ఆర్​యూబీని ప్రారంభించిన మంత్రి.. రంగసాయిపేటలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్​కు శంకుస్థాపన చేశారు.

ఇదే లాస్ట్​ వార్నింగ్​...

ముఖ్యమంత్రి కేసీఆర్​ను భాజపా నాయకులు దూషిస్తే... ఇక సహించే ప్రసక్తి లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఇకనైన పరుషపదాలకు స్వస్తిపలికి సంస్కారంతో మెలగాలని హితవు పలికారు. ఇదే చివరి హెచ్చరిక అని స్పష్టంచేశారు. సినిమా గ్లామర్ కానీ... ఇతర ఆకర్షణలేవీ లేకుండా... 14 ఏళ్లు ఉద్యమం చేసి ధీరోదత్తుడిగా ఎదిగారన్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ... అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్నారని అన్నారు. ఉద్యమాన్ని తలకెత్తుకుని... తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. నాటి నుంచి నేటి వరకూ పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ఘనత కేసీఆర్​దేనని తెలిపారు.

వాళ్లు మాట్లాడటం విడ్డూరం...

వరంగల్​కు తాము ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం ప్రకటిస్తామని... దమ్ముంటే దానికి రెట్టింపు నిధులు కేంద్రం నుంచి తేగలరా అంటూ భాజపా నేతలకు కేటీఆర్​ సవాల్ విసిరారు. ప్రభుత్వ సంస్ధలను అమ్మేసే... భాజపా నాయకులు ప్రభుత్వ కొలువుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. లక్షా 32 వేల 899 ఉద్యోగ నియామకాలు చేశామని... కేంద్రం ఎన్ని ప్రభుత్వ కొలువులిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మోదీ వచ్చిన తరువాతే నిరుద్యోగం పెరిగిందన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బోడ సునీల్ నాయక్ ఆత్మహత్యపై స్పందించిన కేటీఆర్​... సునీల్​ను రెచ్చగొట్టి తప్పుదారిపట్టించారన్నారు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకోవద్దని యువతకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రత్యేక అభిమానం...

ఓరుగల్లుపైన ముఖ్యమంత్రికి ప్రత్యేక అభిమానం ఉందని... అందుకే ఈ నగరాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధమైన ప్రగతికి బాటలు వేశారని అన్నారు. అన్ని సందర్భాల్లో వరంగల్ ప్రజలు తెరాసకు వెన్నంటే నిలిచారని... వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తమకు మద్దతుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై బల్దియాలో గెలుపు అజెండాపై దిశానిర్దేశం చేశారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కేటీఆర్​

Last Updated : Apr 12, 2021, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.