ETV Bharat / city

తెరాస నాయకుడిపై ట్విట్టర్లో ఫిర్యాదు.. స్పందించిన మంత్రి కేటీఆర్​

అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు స్థలం కబ్జా చేశాడంటూ... వరంగల్​కు చెందిన ఓ వ్యక్తి... మంత్రి కేటీఆర్​కు ఫిర్యాదు చేయటం చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్​ ద్వారా వచ్చిన ఆ ఫిర్యాదుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు.

minister ktr responded on complaint on trs leader in twitter

author img

By

Published : Oct 17, 2020, 3:07 AM IST

రహదారిని కబ్జా చేస్తున్నారంటూ ట్విట్టర్​లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా మంత్రి కేటీఆర్​ సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని ఎనిమిదో డివిజన్ విశ్వనాథ్​ కాలనీకి చెందిన 50 అడుగుల రహదారికి అడ్డంగా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు నిర్మాణం చేపట్టడంపై కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి.. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోయారు.

తెరాస నాయకుడిపై ట్విట్టర్లో ఫిర్యాదు.. స్పందించిన మంత్రి కేటీఆర్​
తెరాస నాయకుడిపై ట్విట్టర్లో ఫిర్యాదు.. స్పందించిన మంత్రి కేటీఆర్​

వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్... వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా....టౌన్​ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్న క్రమంలో అధికార పార్టీకి చెందిన నాయకులు అడ్డుపడి చంపుతానని బెదించినట్లు ఫిర్యాదుదారుడు సాంబయ్య ఆరోపించారు. 93 ఫ్లాట్లతో కాలనీ నిర్మాణం జరిగిందని... 50 ఫీట్ల రహదారిని పది అడుగులకు కుదించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

minister ktr responded on complaint on trs leader in twitter
తెరాస నాయకుడిపై ట్విట్టర్లో ఫిర్యాదు.. స్పందించిన మంత్రి కేటీఆర్​

రహదారి నిర్మాణాలను గతంలో కమిషనర్, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లానని... స్పందన లేకపోవడం వల్లే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోయినట్లు వెల్లడించారు. అధికార పార్టీకి చెందిన నాయకుల నుంచి ప్రాణహాని పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సమతా సొసైటీ పేరుతో కాలనీ ఏర్పాటు చేశామని... కాలక్రమేణా విశ్వనాథ కాలనీగా రూపుదిద్దుకుందని సాంబయ్య తెలిపారు.

భూముల ధరలకు రెక్కలు రావడం వల్ల కబ్జాదారులు రహదారులను కుదించి ప్లాట్ల క్రయవిక్రయాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపించారు. ఇటీవలే ఇదే స్థల వివాదంపై కరపత్రం వెలువడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.