కరోనా విషయంలో కేంద్ర సర్కార్.. రాష్ట్ర ప్రభుత్వంపై వివక్ష చూపుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఆక్సిజన్ కొరత ఏర్పడితే.. అందుకు వారే బాధ్యత వహించాలని అన్నారు. వ్యాక్సిన్ ధర విషయంలోనూ వ్యత్యాసం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో తెలంగాణ ప్రజలు ఏమైపోతున్నా పర్వాలేదన్న రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ పటిష్ఠ చర్యలు తీసుకుంటారని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని భరోసానిచ్చారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఏ పార్టీ కేటాయించని రీతిలో బీసీలకు, మహిళలకు పెద్దపీట వేశామని అన్నారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తెరాసనే గెలిపించాలని కోరారు.
- ఇదీ చదవండి : ఖమ్మం ఖిల్లాలో ప్రధాన పక్షాల వ్యూహాత్మక ఎత్తుగడలు