పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా వడ్డేపల్లి 50వ డివిజన్లోని పలు కాలనీలను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండా ప్రకాష్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాలనీల్లో ఇంటింటికీ తిరిగిన మంత్రి స్థానికులను అడిగి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేస్తున్న దుకాణదారులతో మాట్లాడి చెత్త కుండీలలో మాత్రమే చెత్త వేయాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో అలసత్వం వహిస్తున్న సంబందిత శాఖ సిబ్బందిని మందలించారు. వారం రోజుల్లో కాలనీలలోని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: చైతన్యపురిలో ట్రాక్టర్ బీభత్సం