వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ వ్యక్తిని మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు బిల్డింగ్పై నుంచి నెట్టి వేశారు. ఘటనలో నాగరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇతర రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హన్మకొండ బస్టాండ్ వద్ద ఉన్న కూడా కాంప్లెక్స్ బిల్డింగ్పై మద్యం తాగుతుండగా వారి మధ్య ఘర్షణ నెలకొంది.
ఘర్షణలో రమేష్ అనే వ్యక్తి నాగరాజును బిల్డింగ్పై నుంచి నెట్టి వేయగా అతను అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తాగిన మైకంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని.. వివరాలు సేకరిస్తున్నామని సుబేదారి సీఐ అజయ్‌కూమార్ తెలిపారు. వీరు ఇక్కడే ఉంటూ భవన నిర్మాణ పనులు చేస్తారని వెల్లడించారు.