ETV Bharat / city

పేదలకు దుస్తులు పంచిన ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ - Mahabubabad Mla Shankar Naik Distributes Dresses To Poor People

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​ సమయంలో చాలామంది పేదలు ఇబ్బందులు పడుతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.

Mahabubabad Mla Shankar Naik Distributes Dresses To Poor People
రూ.5 లక్షల దుస్తులు పంచిన ఎమ్మెల్యే శంకర్​ నాయక్​
author img

By

Published : May 1, 2020, 5:44 PM IST

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ పేదలకు రూ.5 లక్షల విలువ చేసే దుస్తులు పంపిణీ చేశారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేయడం మన బాధ్యతని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడిమేడ్​ దుస్తుల వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఆయన పలువురు పేదలకు దుస్తులు పంచారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేదలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్న దాతలను ఆయన అభినందించారు. తెలంగాణను కరోనా నుంచి కాపాడడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్​ ఛైర్మన్​ రామ్మోహన్​ రెడ్డి, తెరాస నాయకులు రెడిమెడ్ దుస్తుల వ్యాపారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: స్వస్థలాలకు చేరుకోనున్న 4500 మంది వలస కార్మికులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.