ETV Bharat / city

వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​పై భూ ఆక్రమణ కేసు నమోదు - vardhannapet mla aruri ramesh case

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీసుస్టేషన్​లో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​తో పాటు, తెరాస నేత ధర్మసాగర్, ఫ్యాక్స్ ఛైర్మన్ గుండేటి రాజేశ్వర్​రెడ్డిపై భూ ఆక్రమణ కేసు నమోదైంది. ఈ నెల 22న ఎమ్మెల్యే అనుచరులు అనుమతి లేకుండా తమ స్థలంలోకి ప్రవేశించి, ప్రహరిగోడను కూల్చివేసి బెదిరింపులకు పాల్పడ్డారని దేవిక అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​పై భూ ఆక్రమణ కేసు నమోదు

author img

By

Published : Sep 26, 2020, 10:03 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​పై భూ ఆక్రమణ కేసు నమోదైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీసుస్టేషన్​లో ఎమ్మెల్యేతో పాటు.. తెరాస నేత ధర్మసాగర్, ఫ్యాక్స్ ఛైర్మన్ గుండేటి రాజేశ్వర్​రెడ్డిపై భూ ఆక్రమణ కేసు నమోదైంది. బాలసముద్రానికి చెందిన గుగులోతు దేవిక.. న్యూశాయంపేటలో ఓ వ్యక్తి దగ్గర 2015లో 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తన స్థలంలో చిన్న గది, ప్రహరీ గోడను నిర్మించుకున్నారు.

అయితే ఈ నెల 22న వర్ధన్నపేట ఎమ్మెల్యే అనుచరులు, గుండేటి రాజేశ్వర్​రెడ్డి అక్కడకు వచ్చి గోడను కూల్చివేసి స్థలంలోకి ప్రవేశించారు. ఎమ్మెల్యే అనుచరులు వచ్చి బెదిరింపులకు గురి చేసి, గోడను కూల్చివేశారని.. రూ.లక్ష ఆస్తి నష్టం జరిగిందంటూ బాధితురాలు సుబేదారి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​తో పాటు గుండేటి రాజేశ్వర్​రెడ్డిపై కేసు నమోదు చేశారు.

ఈ విషయంపై ఎమ్మెల్యేను వివరణ కోరగా తాను ఎలాంటి భూ వివాదాల్లో జోక్యం చేసుకోలేదని బదులిచ్చారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో బార్లు, క్లబ్బులు తెరిచేందుకు ప్రభుత్వ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.