ETV Bharat / city

పీజీ వైద్య, దంత ప్రవేశాలకు కాళోజీ వర్సిటీ మరో నోటిఫికేషన్​

author img

By

Published : Jul 15, 2020, 9:52 PM IST

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మరో నోటిఫికేషన్​ జారీ చేసింది. కేంద్రం నీట్​ కటాఫ్​ స్కోర్​ తగ్గించడం వల్ల పీజీ వైద్య, దంత ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వర్సిటీ అధికారులు మరో నోటిఫికేషన్​ను విఢుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

Kaloji_University_Online_Applications in telangana
పీజీ వైద్య, దంత ప్రవేశాలకు కాళోజీ వర్సిటీ మరో నోటిఫికేషన్​

పీజీ వైద్య, దంత ప్రవేశాలకు కటాఫ్ స్కోర్ తగ్గడం వల్ల అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రం నీట్ అర్హత కటాఫ్ స్కోర్ తగ్గించిన విషయం విధితమే. తగ్గిన కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులు రేపట్నుంచి (జులై 16 నుంచి) 18వ తేదీ రాత్రి 9 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు తెలియచేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లకు అభ్యర్థులు ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్ చేసుకొని సంబంధిత సర్టిఫికెట్లను అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుల వెరిఫికేషన్ అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఇటు పీజీ డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 16, 17 తేదీల్లో తుది విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలియచేశారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.

యూనివర్సిటీ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. రేపట్నుంచి ఉదయం 7 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని వారు సూచించారు. యూనివర్సిటీ ఇప్పటికే విడుదల చేసిన అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని అధికారులు పేర్కొన్నారు. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయి జాయిన్ కానీ అభ్యర్థులు, అదే విధంగా కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులని వారు ప్రకటించారు. అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులను కూడా ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పరిగణిస్తారని వర్సిటీ వర్గాలు తెలియజేశాయి.

ఇవీ చూడండి: గిరిజన గురుకులాల్లో 1,950 మంది సీఆర్‌టీల కొనసాగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.