ETV Bharat / city

ఇవాళ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పరిశీలన

author img

By

Published : Dec 10, 2019, 5:34 AM IST

కాళేశ్వరం ప్రాజెక్టును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ సందర్శించనున్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పరిశీలించనున్నారు. అంతకుముందు బోడగూడెంలో గిరిజన ప్రజల కలసుకొని వారి కష్టసుఖాలను తెలుసుకోనున్నారు.

ఇవాళ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పరిశీలన
ఇవాళ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పరిశీలన

రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రెండోరోజు వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. మూడేళ్లలో సాకారమైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు జయశంకర్ భూపాలపల్లికి వెళ్లిన గవర్నర్ తొలుత కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌కు వెళ్లి అక్కడ గోదావరిజలాల ఎత్తిపోతల విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. నిండుకుండల్లా కళకళలాడుతున్న మేడిగడ్డ, అన్నారం, బ్యారేజీలు తిలకిస్తారు. ప్రాజెక్టు విశేషాల్ని అధికారులు గవర్నర్‌కి వివరించనున్నారు.

ఇవాళ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పరిశీలన

గవర్నర్‌ రాకతో కష్టాలు తీరేనా..?
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల గ్రామం బోడగూడెంలో గవర్నర్‌ పర్యటించనున్నారు. కాటారం మండలం నస్తూరుపల్లి పంచాయితీ పరిధిలోని ఆ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. 30 నివాస గృహాలకుగాను 110 మంది నివసిస్తున్నారు. సాగుభూములు, పక్కాఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా సమస్యలతోనే బతుకులీడిస్తున్నామని గ్రామస్థులు వాపోయారు. గవర్నర్‌ రాకతో కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

నందిమేడారం సందర్శన
తమిళిసై పర్యటనతో రెండురోజులనుంచి గ్రామంలో సందడి నెలకొంది. గిరిజనుల సమస్యలు, వారి స్ధితిగతులు, జీవనవిధానాలు తెలుసుకోనున్నారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో కాళేశ్వరం ప్రాజెక్టు వీక్షించి సాయంత్రానికి గవర్నర్ హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు.

ఇవీ చూడండి: గవర్నర్​ కాన్వాయ్​ ఎదుట ప్లకార్డులతో నిరసన'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.