వరంగల్ రూరల్ జిల్లా పరకాల సబ్‌డివిజన్ పరిధిలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆత్మకూరు మండలం కటాక్షపుర్లో చెరువు మత్తడి పడుతోంది. హనుమకొండ ములుగు జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. పరకాల పట్టణంలో దామర చెరువు నీరు సమీప కాలనీలను ముంచెత్తింది. శ్రీనివాసా కాలనీ, మమతా నగర్ పూర్తిస్థాయిలో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద నీటిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
పరకాల పట్టణానికి చెందిన గంజి సమ్మయ్య కుటుంబం దామెర చెరువు వరదల్లో చిక్కుకున్నారు. పోలీసులు జేసీబీ సహాయంతో కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. పరకాల హుజూరాబాద్ రోడ్డు పూర్తిస్థాయిలో జలదిగ్బంధంలో చిక్కుకుంది. చలివాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. చలివాగు వంతెన వద్ద చిక్కుకున్న వరద నీటిలో 27 మంది చిక్కుకున్నారు.
ఇదీ చూడండి:కేటీఆర్ చొరవతో వాగులో చిక్కుకున్న 12 మంది రైతులను కాపాడిన అధికారులు