కొత్త రెవెన్యూ చట్టం విధాన సభలో ఆమోదం పొందిన సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్‌ను రెవిన్యూ, టీజీఓ, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.
అనేక సంస్కరణలతో ప్రజాపరిపాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన విప్లవాత్మక, చరిత్రాత్మక సంస్కరణ ఇది అని మంత్రులు తెలిపారు. ఈ చట్ట సంస్కరణతో ప్రజలు, రైతుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.