ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అర్చకులు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
భద్రకాళి మాతను మహిషాసుర మర్దినిగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
ఇదీ చూడండి: లైవ్: సింగపూర్లో బతుకమ్మ సంబురాలు.. కాసేపట్లో..