రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ సంతృప్తికరంగా సాగుతుందని... ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన శ్రీనివాస్‌రావు... డ్రైరన్ సాగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. డ్రైరన్ నిర్వహణలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్నది... జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1200 కేంద్రాల్లో 20 వేలమంది లబ్దిదారులు... డ్రైరన్‌లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయడానికి ముందుగా... ఈ ప్రక్రియలో ఏమైనా లోపాలు, ఇబ్బందులు ఉంటే తెలుసుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. వారం రోజుల్లోపే వచ్చే వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు.