వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం మొదలైంది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఇవాళ 6,108 మంది సూపర్ స్ప్రెడర్లకు వరంగల్, హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, ధర్మసాగర్, హసన్ పర్తి కమలాపూర్, భీమదేవరపల్లి తదితర 18 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేశారు. జర్నలిస్టులకు 5 కేంద్రాల్లో టీకాలు పంపిణీ చేశారు.
కార్పొరేషన్ పరిధిలో గుర్తించిన 90,500 మందికి 5 కేంద్రాల్లో ప్రతి రోజూ 5 వేల మంది చొప్పున రేపట్నుంచి టీకాలు వేయనున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో 16 కేంద్రాల్లో 3,305 మంది వాహకులకు వైద్యశాఖ అధికారులు టీకాలు వేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా 7 కేంద్రాల్లో 1350 మంది, జనగామ జిల్లాలో 12 కేంద్రాల్లో 1857 మందికి, ములుగు జిల్లాలో 13 కేంద్రాల్లో 698 వాహకులకు టీకా ఇస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో 1643 మంది సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వ్యాక్సిన్లు అందజేస్తున్నారు.
- ఇదీ చూడండి : మతం మార్చుకోలేదని మైనర్పై అత్యాచారం!