వరంగల్ నగరంలో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ అన్నారు. వరంగల్ నగరంలోని అండర్ రైల్వే బ్రిడ్జి దగ్గర ఏర్పాటు చేసిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన తండ్రి అజాంజాహి మిల్లులో పని చేసే వాడని 5వ తరగతి వరకు వరంగల్‌లో విద్యాభ్యాసం చేసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. అభివృద్ధిలో ఆనాడు నగరం ఎలా ఉందో ప్రస్తుతం అదే విధంగా ఉందన్నారు. భవన నిర్మాణంలో మార్పులు వచ్చాయి తప్ప రహదారుల పరిశ్రమ అభివృద్ధి చెందలేదన్నారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ యాప్లో కొత్త ఫీచర్స్