ETV Bharat / city

మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్​ గాడి తప్పింది: కేటీఆర్​ - kcr

దేశ ప్రజలు భాజపా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. మోదీ వేడి తగ్గిందని, కాంగ్రెస్​ గాడి తప్పిందని వ్యాఖ్యానించారు.

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
author img

By

Published : Mar 25, 2019, 8:13 PM IST

Updated : Mar 25, 2019, 9:07 PM IST

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​, భాజపాయేతర ఎంపీలు 150మందికి పైగా గెలవబోతున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ జోస్యం చెప్పారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్​ గాడి తప్పిందని ఎద్దేవా చేశారు. 2014లో నరేంద్రమోదీ మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని 280 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రధానిగా దేశానికి ఏమీ చేయలేక పోయారని విమర్శించారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన కేసీఆర్​కు 16 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి నిధులు పరిగెత్తుకుంటూ వస్తాయన్నారు.

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

ఇవీ చూడండి:ముగిసిన నామినేషన్ల పర్వం

Last Updated : Mar 25, 2019, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.