పిండ ప్రదానానికి వచ్చి ప్రమాదవశాత్తు గోదావరిలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద జరిగింది. ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన నీరడి సంజయ్.. కుటుంబ సభ్యులకు పిండ ప్రదానం చేసేందుకు కందకుర్తి సమీపంలోని గోదావరి వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో సంజయ్.. కొద్దిదూరం కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గజ ఈతగాళ్ల సాయంతో యువకుడిని ఒడ్డుకు చేర్చారు. తాజా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు... ఆ ప్రాంతంలోకి ఇతరులు వెళ్లకుండా తాళ్లు కట్టారు.
నిన్న నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో భారీ వర్షాలు, వరదలకు పూడ్చిపెట్టిన మృతదేహం కొట్టుకుపోయింది. బెజ్జోర సమీపంలోని కప్పల వాగులో.. సుమారు కిలోమీటరు దూరం వాగులోని నీటిలో తేలియాడుతూ కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొట్టుకొచ్చిన మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు మళ్లీ అదే వాగు సమీపంలో దహనం చేశారు.
ఇదీచూడండి: Dead body: వరద నీటికి కొట్టుకుపోయిన మృతదేహం