జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణపై నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, గుర్తుల కేటాయింపు వంటి అంశాలపై ఏఆర్వోలకు రిటర్నింగ్ అధికారి అవగాహన కల్పించారు. జిల్లాలో మొత్తం 25 జడ్పీటీసీలు, 299 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో వేణు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 1,599 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నిజామాబాద్లో 7,78,456 మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండిః రికార్డు స్థాయిలో నమోదవుతున్న పత్తి ధరలు