ETV Bharat / city

కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్​పైనే ఆశలు - rtc in lose

కారణమేదైనా ఆర్టీసీని నష్టాలు మాత్రం వీడటం లేదు. కరోనా కారణంగా బస్సు ఆక్యుపెన్సీ పడిపోయి.. నష్టాలు రెట్టింపయ్యాయి. ప్రతి నెలా కోట్లలో నష్టం వస్తోంది. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని బస్సులు నడుపుతున్నా.. ఆదాయం మాత్రం పెరగడం లేదు. ఖాళీగా ఉన్న సీట్లను పార్శిల్స్ ద్వారా భర్తీ చేసే ప్రయత్నం చేస్తోంది ఆర్టీసీ. నిజామాబాద్ రీజియన్‌లో ఆర్టీసీ నష్టాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్​పైనే ఆశలు

author img

By

Published : Jul 29, 2020, 7:34 AM IST

కరోనా దృష్ట్యా లాక్‌డౌన్ అమలుతో ఆర్టీసీకి ఆదాయం కరవైంది. మే 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. నిజామాబాద్ రీజియన్‌ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని మొత్తం ఆరు డిపోల పరిధిలో 711 బస్సులు ఉన్నాయి. అన్ని మార్గాల్లో బస్సులను నడుపుతున్నప్పటికీ.. ప్రయాణికుల నుంచి అంతగా ఆదరణ కనిపించడం లేదు. శానిటైజర్ అందుబాటులో ఉంచడంతోపాటు.. మాస్కులు ఉన్న వారినే బస్సులోకి అనుమతిస్తున్నారు. కరోనా భయంతో అత్యవసర పని ఉండి, సొంత వాహనాలు లేని వారు మాత్రమే బస్సును ఆశ్రయిస్తున్నారు.

పడిపోయిన ఆదాయం..

నిజామాబాద్ రీజియన్‌లోని డిపోల నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ తదితర ప్రాంతాలకు బస్సులు తిరుగుతాయి. హైదరాబాద్, వరంగల్‌కు బస్సులను ఎక్కువగా నడుపుతారు. లాక్‌డౌన్​కు ముందు వరకు రోజూ రూ.కోటి ఆదాయం వచ్చేది. అదికాస్తా కరోనా దెబ్బతో రూ.25 లక్షల నుంచి రూ.30లక్షలకు పడిపోయిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

పార్శిల్​పైనే ఆశలు..

నష్టాల నుంచి గట్టెక్కేందుకు పలు ప్రత్యామ్నాయలకు యత్నిస్తోంది ఆర్టీసీ. ఇందులో భాగంగా ప్రయాణికులు లేకుండా ఖాళీగా ఉండే సీట్లను పార్శిల్స్‌తో భర్తీ చేస్తున్నారు. ఇంట్లో వినియోగించే వస్తువులతో పాటు ఏ వస్తువునైనా పార్శిల్స్ ద్వారా పంపించవచ్చని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

కరోనా నిబంధనలను పాటిస్తూ... శానిటైజ్ చేస్తూ బస్సులు నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు.

ఇవీ చూడండి: కోతులకు అంతిమ సంస్కారం.. గ్రామస్థుల ఔదార్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.