ETV Bharat / city

"గెలిస్తే పసుపు బోర్డు, మద్దతు ధర ఇస్తాం"

దేశంలో మరోసారి నరేంద్ర మోదీని ప్రధాని పీఠం ఎక్కించాలన్న లక్ష్యంతో భాజపా ముమ్మర ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశ పరిచిన భాజపా... పార్లమెంటు పోరులో పాగా వేసేందుకు మోదీతో పాటు కేంద్ర మంత్రులనూ రంగంలోకి దించింది. నిజామాబాద్​,​ మహబూబాబాద్​ బహిరంగ సభలో పాల్గొన్న హోం మంత్రి రాజ్​నాథ్​సింగ్​... తన ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సాహం
author img

By

Published : Apr 2, 2019, 8:30 PM IST

ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సాహం
రాష్ట్రంలో కాషాయం పుంజుకునేందుకు కమలనాథులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఎంపీలను గెలిపించుకునేందుకు స్వయంగా మోదీ, కేంద్ర మంత్రి రాజ్​నాథ్​సింగ్​ రాష్ట్రంలో పర్యటిస్తూ... ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో తెరాసకు రెండో అవకాశం ఇచ్చినట్లే... దేశంలో భాజపాకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు.

అభివృద్ధి భారతం దిశగా...

మహబూబాబాద్​లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి రాజ్​నాథ్ సింగ్​​... మోదీ మరోసారి తప్పకుండా ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి కోసం ఐదేళ్లుగా భాజపా విశేష కృషి చేసిందని... మరోసారి అవకాశం ఇస్తే పేదరికం లేని దేశంగా భారత్​ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు సైతం భారత్​వైపు చూసేలా మోదీ కృషి చేశారని వెల్లడించారు. మరోసారి అవకాశం ఇస్తే... 2028 కల్లా దేశాన్ని అభివృద్ధిలో మూడో స్థానానికి చేరుస్తామని తెలిపారు.

పసుపు, ఎర్రజొన్న రైతులకు బాసట...

అంతకు ముందు నిజామాబాద్​ పాలిటెక్నిక్​ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రాజ్​నాథ్​... రైతుల కోసం నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పిస్తామని... మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ప్రకటించారు.

ప్రగతి పథంలో నడిపించేందుకు...

పదేళ్లు పాలించిన యుపీఏ... పేదలను పట్టించుకోలేదని ఆరోపించిన మంత్రి... 2022లో ప్రతి పేదవానికి ఇళ్లుండేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు భరోసా కల్పించి భాసటగా నిలుస్తామన్నారు. మోదీని ప్రధాని చేసి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు సమర్థులైన భాజపా ఎంపీలను గెలిపించాలని రాజ్​నాథ్​ కోరారు.

వేదిక వద్ద స్వల్ప అగ్నిప్రమాదం...

కేంద్ర హోం మంత్రి పాల్గొన్న నిజామాబాద్​ సభలో స్వల్ప అపశ్రుతి దొర్లింది. వేదిక పక్కనే షార్ట్ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. కొన్ని క్షణాల ముందు అదే ప్రదేశంలో రాజ్​నాథ్​ వాహనం ఆపిఉంచారు. సిబ్బంది అప్రమత్తతో తృటిలో ప్రమాదం తప్పింది.

ఇవీ చూడండి:దేశమంతా ఓ ఎత్తు... నిజామాబాద్​ మరోఎత్తు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.