ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 9వ తేదీన ఎన్నిక జరగనుందని వెల్లడించారు. అక్టోబర్ 8వ తేదీన సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేస్తామన్నారు. మొత్తం 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో 28 పోలింగ్ కేంద్రాలు నిజామాబాద్ జిల్లాలో, మరో 22 కామారెడ్డిలో ఉన్నాయని తెలిపారు. 48 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మిగతా రెండు పోలింగ్ కేంద్రాలను వీడియో కెమెరా ద్వారా కవర్ చేయడం జరుగుతుందన్నారు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ మాస్కు, గ్లౌజులు ధరించాలని సూచించారు. 12వ తేదీ కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కామారెడ్డి కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేత, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, మున్సిపల్ కమిషనర్ జితేష్ బి పాటిల్, ఆర్డీవోలు, పోలీసులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస గెలుపు తథ్యం: కేటీఆర్