వైద్యసిబ్బందిని అడ్డుకున్న నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇద్రిస్ సహా మరో పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటోనగర్‌లో ఇంటింటి సర్వేకు వెళ్లిన వైద్య సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెసుకుని అక్కడికి వెళ్లిన పోలీసులనూ అడ్డుకున్నారు. డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ... పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
లాక్‌డౌన్ ఉల్లంఘన కింద ఆరో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటోనగర్‌లో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటి ఎదురుగా ఓ వృద్ధురాలు మృతి చెందారు. అనుమానిత మృతిగా భావించి.. కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వారిని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తుండగా స్థానికులతో కలిసి డిప్యూటీ మేయర్ అడ్డుకున్నారు
ఇదీ చదవండి: లాక్‌డౌన్ ఎఫెక్ట్: తిరుమలలో స్వేచ్ఛగా వన్యప్రాణుల సంచారం