డిగ్రీ పరీక్షల రీత్యా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లను(ఎస్ఎంహెచ్) తెరవాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని ఫిర్యాదు బాక్సులో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ నెల 15 నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న డిగ్రీ ఆఖరు సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారని కానీ అత్యధిక శాతంలో విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని.. పీడీఎస్యూ ఉపాధ్యక్షులు జాదవ్ సాయి పేర్కొన్నారు.
కరోనా నేపథ్యంలో చాలా గ్రామాలు పూర్తి లాక్డౌన్లో ఉన్నాయని, విద్యార్థులు వచ్చి పరీక్ష రాయడం కష్టంగా ఉంటుందని హాస్టల్ సౌకర్యం లేకపోతే గ్రామీణ విద్యార్థలు ఇబ్బంది పడతారని జాదవ్ సాయి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లాలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లను తెరవాలని అధికారులను కోరారు.
ఇదీ చదవండిః 'తక్కువ సమయం.. ఎక్కువ ప్రశ్నల ఛాయిస్'