గిరిజన కుటుంబాలకు సీఎం గిరి వికాస్ పథకం వరం లాంటిదని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. గిరి వికాస్ పథకంపై అధికారులతో కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో 52 విద్యుత్ మోటార్ల బోర్ డ్రిల్లింగ్ యూనిట్స్ గాను 32 యూనిట్లు పూర్తైనట్టు తెలిపారు. మిగిలిన 20 యూనిట్లు ప్రోగ్రెస్‌లో ఉన్నట్టు వివరించారు.
ఎంపీడీవోల ద్వారా అర్హులైన గిరిజన రైతులను ఎంపిక చేసి, వారి భూమిలో వ్యవసాయ బోరు వేసి, మోటారు, విద్యుత్తు మీటరు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్టీవో శ్రీనివాస్, డీటీడీవో సంధ్యారాణి, విద్యుత్ శాఖ, భూగర్భజలాలు శాఖ అధికారులు పాల్గొన్నారు.