ETV Bharat / city

ఓట్ల లెక్కింపు నేడే.. తెరాస గెలుపు లాంఛనమే! - నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

నిజామాబాద్‌ స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఆరు టేబుళ్లపై రెండు రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. 10.30 గంటలకల్లా ఫలితం వచ్చే అవకాశం ఉంది. తెరాస నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ నుంచి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, భాజపా నుంచి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. అయితే పోలింగ్​కు ముందే కవిత విజయం ఖరారైందని.. ఎన్నిక కేవలం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఓట్ల లెక్కింపు నేడే.. తెరాస గెలుపు లాంఛనమే!

author img

By

Published : Oct 12, 2020, 5:01 AM IST

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 99.64 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 824 ఓట్లకు గాను 821 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో ఇద్దరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. బోధన్​కు చెందిన ఓ కౌన్సిలర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా.. అక్కడ ఖాళీ ఏర్పడింది. ఇక స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లు అధికార తెరాస పార్టీ గెలుచుకుని ముందంజలో ఉంది. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ వంటి పదవులు గులాబీ పార్టీ ఎక్కువగా గెలుచుకుంది.

మారిన పరిణామాలు..

500 మంది ప్రజా ప్రతినిధుల బలం తెరాసకు ఉండగా కాంగ్రెస్​కు 140 ఓట్లు, భాజపాకు 84, ఎంఐఎంకు 28 ఓట్లున్నాయి. స్వతంత్రులు 66 మంది స్థానిక పోరులో గెలిచారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్వతంత్రులతో పాటు వివిధ పార్టీల నుంచి తెరాసలోకి వలస వెళ్లారు. ఇక ఎమ్మెల్సీ నోటిఫికేషన్ తర్వాత పార్టీ ఫిరాయింపులు మరింతగా పెరిగాయి.

పకడ్బందీ వ్యూహంతో..

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్​కు చెందిన ఏడుగురు జెడ్పీటీసీలు, 30 మందికి పైగా ఎంపీటీసీలు గులాబీ గూటికి చేరారు. భాజపా నుంచి ఒక జెడ్పీటీసీ, ఏడుగురు కార్పొరేటర్లు, పలువురు ఎంపీటీసీలు అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. 90 శాతం మంది ఇండిపెండెంట్లు కూడా కారెక్కేశారు. దీంతో తెరాస బలం మరింత పెరిగింది. పకడ్బందీ వ్యూహంతో గులాబీ నేతలు ఈ ఎన్నికల్లో ముందుకు సాగారు. అటు కమలం, ఇటు హస్తం పార్టీ ఓట్లకు గాలం వేస్తూ వారికి గులాబీ కండువా కప్పడంలో సఫలమయ్యారు. క్రాస్ ఓటింగ్​కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశారు.

ఏకపక్షంగా సాగిన పోలింగ్​!

తెరాస అభ్యర్థి కవిత సునాయాసంగా గెలిచేందుకు సంపూర్ణ మెజార్టీ ఓట్లు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులందరినీ శిబిరాలకు తరలించారు. పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఓటు వేసే వరకు అప్రమత్తంగా వ్యవహరించారు గులాబీ నేతలు నేతలు. కాగా పోలింగ్ సరళి కూడా పూర్తి ఏకపక్షంగా సాగినట్లు స్పష్టం అవుతోంది. గట్టి పోటీ ఇవ్వడానికి కావాల్సిన మెజార్టీ కూడా లేనందున ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలు అంతగా ప్రభావం చూపలేక పోతున్నాయి.

పోలింగ్​కు ముందే కవిత విజయం ఖరారైందని... ఎన్నిక కేవలం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ పార్టీ వర్గాలు సైతం అదే ధీమాతో ఉన్నాయి. నేడు జరిగే కౌంటింగ్​తో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

ఇవీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తంపై మంత్రుల సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.