నిజామాబాద్‌లో అధికంగా కరోనా కేసులు నమోదుకావడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వివిధ శాఖల సమన్వయంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసింది యంత్రాంగం. లాక్డౌన్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తూనే చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఇంటింటి సర్వే, ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు గుర్తించి పరీక్షలు నిర్వహించడం, రెడ్జోన్లను నో మూమెంట్ జోన్‌గా మార్చడం, క్వారంటైన్ కచ్చితంగా అమలయ్యేలా చూడడం ఫలితంగా వైరస్ సామాజిక వ్యాప్తి చెందకుండా నియంత్రించారు.
జిల్లాలో మొత్తం 61 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 53 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 8 మంది త్వరలోనే ఇంటికి వెళ్లనున్నారు. నిజామాబాద్ జిల్లాలో కరోనా కట్టడిలో విజయం సాధించామని.. ప్రజలు సంపూర్ణంగా సహకరించారని.. త్వరలోనే గ్రీన్‌జోన్‌లోకి మారుతుందని చెబుతోన్న కలెక్టర్ నారాయణరెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి..