నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వేల్పూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. భీంగల్ పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి నిజామాబాద్ వెళ్తుండగా వేల్పూరు ఎమ్మార్వో ఆఫీసును పరిశీలించారు.
రోడ్డు పక్కన నాటిన మొక్కలు ఎండిపోవడం గమనించి సంబంధిత అధికారులను ప్రశ్నించారు. వెంటనే ఆ చెట్ల స్థానంలో వేరేవి నాటాలని ఆదేశించారు. అనంతరం అమీనాపూర్ గ్రామాల్లో నర్సరీలను తనిఖీ చేశారు. వేసవి రాకముందే మొక్కల పెంపకం పూర్తిచేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: నాంపల్లి కోర్టుకు హాజరైన కల్వకుంట్ల కవిత