ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్తలకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
జిల్లాలో తొలి టీకాను పారిశుద్ధ్య కార్మికుడు అజయ్‌కు వేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని కలిసి మంత్రి.. ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో మొదటి దశలో 15వేల మంది వైద్యారోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి, రెండో దశలో రెవెన్యూ, పోలీసు సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తామని వేముల తెలిపారు. అన్ని జాగ్రత్తల మధ్య వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
- ఇదీ చూడండి : ఈ సమయం కోసమే ప్రపంచమంతా ఎదురుచూస్తోంది : గవర్నర్