ETV Bharat / city

'కేంద్రంపై తెరాస ప్రకటించిన ఉద్యమానికి రైతులంతా కదిలిరావాలి..' - మంత్రి ప్రశాంత్​రెడ్డి

Minister prashanth reddy comments: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై తెరాస ప్రకటించిన ఉద్యమంలో రైతులంతా కలిసిరావాలని మంత్రి ప్రశాంత్​రెడ్డి, ఎమ్మెల్యే జీవన్​రెడ్డి కోరారు. తెలంగాణ ప్రజలను అవమానపర్చిన కేంద్రానికి నిరసన సెగ తాగేలా చేద్దామని సూచించారు.

Minister prashanth reddyand MLA Jeevanreddy comments on Nizamabad MP arvind

author img

By

Published : Apr 3, 2022, 8:27 PM IST

'కేంద్రంపై తెరాస ప్రకటించిన ఉద్యమానికి రైతులంతా కదిలిరావాలి..'

Minister prashanth reddy comments: ధాన్యం కొనుగోలులో కేంద్రం తీరుపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్​లోని ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలులో కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస తలపెట్టే పోరాటంలో రైతులంతా కలిసి రావాలని కోరారు. రేపటి నుంచి ఈ నెల 11 వరకు వివిధ రూపాల్లో చేపట్టనున్న నిరసనల్లో పాల్గొని కేంద్రానికి తమ సత్తా తెలియజేద్దామన్నారు.

"తెలంగాణపై కక్ష పెట్టుకొని రెండేళ్లుగా కేంద్రం పేచీలు పెడుతోంది. గతంలో బాయిల్డ్ రైస్ తీసుకొని.. ఇపుడు ఎందుకు వద్దంటున్నారు..? దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్​గోయల్​ని కలిస్తే అవమానకరంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినటం అలవాటు చేయండని చులకన చేసి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై తెరాస చేస్తున్న ఉద్యమంలో రైతులంతా కదిలిరావాలి. మనల్ని అవమానపర్చిన కేంద్రానికి మన నిరసన సెగ తాకేలా చేయాలి." - వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి

భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​పై ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్సీ కవితపై.. నోరు జారితే బాగుండదని అర్వింద్​ను హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకైన ఖర్చు రూ.85 వేల కోట్లయితే.. లక్ష కోట్ల అవినీతి జరిగిందని అర్వింద్ అనటం ఆయన అవగాహనా లోపమని జీవన్​రెడ్డి ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.