రైతుల సంక్షేమం కోసం తెరాస తిరుగులేని పోరాటం చేస్తుంటే భాజపా అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పసుపు బోర్డు కోసం ఎంపీ కవిత ఆధ్వర్యంలో పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. పసుపు రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తేలేదని రాం మాధవ్ వ్యాఖ్యానించడం సరైంది కాదని ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా చేయాలి