నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భూ మాఫియా దందా నడుస్తోందని మజ్లీస్ బచావో తహరిక్ (ఎంబీటీ) రాష్ట్ర అధ్యక్షుడు అంజదుల్లా ఖాన్ ఆరోపించారు. వందల కోట్ల విలువ చేసే వక్ఫ్ భూములను ఎంఐఎం, తెరాస నాయకులు కలిసి కబ్జా చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ వక్ఫ్ భూములను పరిరక్షిస్తామని చెప్పి.. ఇప్పటి వరకు కమిషన్ను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలోని అబ్దుల్ రెహ్మాన్ గెస్ట్ హౌస్, బోధన్ రోడ్లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు.
నగర నడిబొడ్డులో ఉన్న భూములపై ఇటీవలే షాపింగ్ మాల్స్, మల్టి కాంప్లెక్స్, స్టార్ హోటల్స్ నిర్మించారని.. మొత్తం 4,302 గజాల భూమి కబ్జాకు గురైందని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పట్టించుకోవడం లేదన్నారు. 12 శాతం రిజర్వేషన్ను సీఎం మరిచిపోయారని దుయ్యబట్టారు. నగరంలోని మైనార్టీ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కరవయ్యాయన్నారు. హైదరాబాద్లో వరదలకు సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. చెరువుల కబ్జాయే ప్రధాన కారణమని ఆరోపించారు.
ఇదీ చూడండి: కరోనా నుంచి కోలుకున్న రెండు లక్షల మంది బాధితులు