లాక్డౌన్ సడలింపు సమయంలో నిజామాబాద్ నగరంలోని రహదారులన్ని కిటకిటలాడాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలు బయటకు రావడం వల్ల నగరం సందడిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించలేదు. కూరగాయల మార్కెట్, దుకాాలు, మద్యం షాపులు.. వంటి ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలను ప్రజలు గాలికొదిలేశారు. పలు ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
సడలింపు సమయం దాటిన తర్వాత.. రహదారులపైకి వచ్చిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు. 10 గంటలు దాటిన తర్వాత బయటకు వచ్చిన వారిని అడ్డుకున్న పోలీసులు.. వాహనాలను సీజ్ చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా ఆంక్షలు పాటిస్తూ తమకు సహకరించాలని కోరుతున్నారు.
- ఇదీ చదవండి: Covid Query: ఫోన్‌కాల్ దూరంలో... వైద్య సలహాలు!