ఉమ్మడి నిజామాబాద్లో లాక్డౌన్ కొనసాగుతోంది. పోలీసులు నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదివేలకుపైగా వాహనాలు సీజ్ చేశారు. ఇందులో నాలుగు వేలకుపైగా వాహనాలకు చలానా విధించి వదిలేశారు. మిగతా వాటిని సైతం చాలానా విధించనున్నారు.
జిల్లాలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కరోనా నుంచి కోలుకుని 36 మంది ఇళ్లకు చేరారు. గత ఎనిమిది రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. కామారెడ్డి జిల్లాలోనూ గత పదిహేడు రోజులుగా కొత్త కేసులు లేవు. 9 మంది డిశ్చార్జ్ కాగా... ప్రస్తుతం 3 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాలో రెండు రెడ్ జోన్లను ఆరెంజ్ జోన్లుగా మార్చారు. జాతీయ రహదారి 44 మీద వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తుండగా వారికి స్వచ్ఛంద సంస్థలు ఆహారం అందిస్తున్నాయి.
ఇదీ చూడండి: 'గుడుంబా తయారీ నిర్మూలనకు పటిష్ఠ చర్యలు'