జీవో నంబర్ 6ను వెంటనే రద్దు చేయాలని నిజామాబాద్ అర్సపల్లిలోని డీఎఫ్టీఎస్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌కు గంగపుత్ర సంఘం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మత్స్యకారులు వినతి పత్రం అందించారు. ముదిరాజులకు సభ్యత్వం కల్పించకూడదని డిమాండ్ చేశారు.
ముదిరాజ్లకి సభ్యత్వం ఇస్తే ఇప్పుడు అంతంత మాత్రంగా ఉన్న ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గంగపుత్ర కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని సంఘం అధ్యక్షుడు బొర్గం శ్రీనివాస్ గంగపుత్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 18వేల పైగా కుటుంబాలు చేపలు పట్టే వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాయన్నారు. కాబట్టి వెంటనే జీవో నంబర్ 6ను రద్దు చేయాలని గంగపుత్రులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బాలగంగాధర్, కాార్యవర్గ నేతలు తదితరులు పాల్గొన్నారు.