కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 12న ఓట్ల లెక్కింపు చేపడతారు. 14వ తేదీ వరకు ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ తేదీ ఖరారు నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటించింది.
కరోనా నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, హాళ్లు, ప్రాంగణాల వద్ద థర్మల్ స్కానింగ్, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని తెలిపింది. భౌతికదూరాన్ని పాటించాలని, ఎన్నికల ప్రక్రియ కోసం పెద్ద హాళ్లను ఉపయోగించాలని ఈసీ సూచించింది.
నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన్ను అనర్హుడిగా ప్రకటిస్తూ అప్పటి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇవీ చూడండి: ఒక్కరోజులో ఎస్పీ ఎన్ని పాటలు పాడారంటే..?