ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు వినూత్న ప్రచారాలు చేస్తూనే వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తైతే.. నిజామాబాద్ పోలింగ్‌పై కల్పిస్తోన్న అవగాహన మరో ఎత్తు. దేశంలోనే తొలిసారిగా 12 ఈవీఎంలతో నిర్వహిస్తోన్న పోలింగ్‌పైనే అందరి దృష్టి. ఇందూరు లోక్‌సభ ఎన్నికలను ఈసీ కూడా సవాలుగా తీసుకుంది. ఓటర్లలో అయోమయాన్ని తొలగించేందుకు డాక్యుమెంటరీని తయారుచేసింది.
ముందుగానే గుర్తు తెలుసుకోండి
గ్రామీణ ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా రూపొందించిన ఈ డ్యాక్యుమెంటరీని జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ విడుదల చేశారు. ఇప్పటికే జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తోన్న అధికారులు, తాజాగా ఈ డాక్యుమెంటరీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సామాజిక మధ్యమాలను వేదికగా ఎంచుకున్నారు. అభ్యర్థికి సంబంధించిన గుర్తును ముందుగానే ఓటరు చూసుకుంటే త్వరగా ఓటు వేసే అవకాశం ఉందని జగిత్యాల కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు వేగిరం