ETV Bharat / city

ys sharmila praja prasthanam: ముఖ్యమంత్రిని మారిస్తేనే పేదల బతుకులు బాగుపడతాయి: వైఎస్​ షర్మిల

డిండి ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న జలాశయాల ద్వారా భూములు కోల్పోతున్న రైతులకు.. తగిన పరిహారం చెల్లించాలని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. వైఎస్ తన అయిదేళ్ల పాలనలో 30 సార్లు నల్గొండ జిల్లాలో పర్యటించారని గుర్తు చేశారు. పాదయాత్రలో భాగంగా ఆమె పలు గ్రామాల్లో ప్రజల్ని కలుసుకున్నారు.

ys sharmila
ys sharmila praja prasthanam
author img

By

Published : Nov 6, 2021, 5:59 AM IST

ప్రభుత్వ అధికారులకు చెబితే సమస్యలు తీరే పరిస్థితులు లేవని.. ముఖ్యమంత్రిని మారిస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు వచ్చినపుడే ఆ ప్రాంతంలో పథకాలు అమలవుతాయని.. ఎన్నికలు అవగానే వాటికి కాలం చెల్లుతుందని విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో షర్మిల పర్యటన సాగింది. వట్టిపల్లి, భీమనపల్లి కాలనీ, దామెర భీమనపల్లి, దామెరక్రాస్​ మీదుగా పాదయాత్ర చేపట్టారు. తమకు పింఛన్లు రావడం లేదని పలువురు ఫిర్యాదు చేయగా.. డిండి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. ఎకరానికి 40 లక్షలు పలికే భూమికి కేవలం.. 4 లక్షల 15 వేలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

దామెర భీమనపల్లి గ్రామంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించగా... స్థానికుల సమస్యలను షర్మిల అడిగి తెలుసుకున్నారు. మర్రిగూడ మండల కేంద్రమైనా... రహదారులు సరిగా లేవని పలువురు ఆమెకు వివరించారు.

ఇదీచూడండి: Harish Rao: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.