నల్గొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమం రసాభాసాగా మారింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నువ్వెంత..నీ లెక్కెంత అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు.
వానాకాల నియంత్రిత్ర పంటల సాగు కార్యచరణ ప్రణాళికలలో భాగంగా నల్గొండ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని మంత్రి ప్రసంగిస్తుండగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విబేధించారు. రుణమాఫీ ఎక్కడ చేశారని అడ్డుకున్నారు.
మంత్రి, ఎంపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నువ్వెంత..నీ లెక్కెంత అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. ఓ దశలో కొట్టుకునేంత పని చేశారు. దీంతో ఆ కార్యక్రమంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
ఇదీ చూడండి: తేనెటీగల దాడి..ఇబ్బంది పడ్డ మెగా ఫ్యామిలీ