నల్గొండ జిల్లా అనుముల మండలకేంద్రంలో తెజస అధ్యక్షుడు కోదండరాం పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని కోదండరాం అన్నారు.
ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు తీవ్ర పంటనష్టం జరిగితే ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తడిసిన ధాన్యం, పత్తి పంటలకు మద్దతు ధరలను అందించడంలో రైతులకు సర్కారు అన్యాయం చేస్తోందని కోదండరాం ఆరోపించారు. పట్టభద్రుల ఎన్నికల్లో పట్టభద్రులు తప్పక వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఈసారి ధాన్యం అమ్మకాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు: మంత్రి సత్యవతి