సూర్యాపేట జిల్లాలో కరోనా కోరలు చాస్తుంది. వారం వ్యవధిలోనే జిల్లాలో కేసుల సంఖ్య 20కి చేరింది. నిన్న ఒక్క రోజే 8 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు, వర్ధమానుకోట, తిరుమలగిరి, నేరేడుచర్లలో కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాలన్నింటిని హాట్స్పాట్లుగా అధికారులు ప్రకటించారు .
రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోన్న కారణంగా జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌ను కఠినతరం చేశారు. ఇప్పటి వరకు పట్టణంలోని 15 వార్డులే రెడ్‌జోన్ పరిధిలో ఉండగా.. తాజా కేసులతో జిల్లా కేంద్రం మొత్తాన్ని రెడ్‌జోన్ పరిధిలోకి తెచ్చేందుకు కలెక్టర్, ఎస్పీ ప్రణాళికలు సిద్ధం చేశారు.
కూరగాయల మార్కెట్ బజార్, కొత్త బస్‌స్టాండ్, శంకర్ విలాస్ ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్, ఎస్పీ నిత్యవసరాలకు ఎవ్వరూ బయటకి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇంటి వద్దకే నిత్యావసరాలు చేరవేసేందుకు చర్యలు చేపట్టాలని స్థానిక మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.
ఇవీ చూడండి: 'మరో 2 రోజుల్లో బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి'