'మర్డర్' చిత్రం విడుదలను అడ్డుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అమృత పిటిషన్పై నల్గొండ జిల్లా కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. ఈ సినిమాలో తనను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణపై ఆమె వ్యాజ్యం దాఖలు చేశారు. ఇవాళ్టి విచారణకు దర్శకనిర్మాతలు హాజరుకావలసి ఉన్నా.. వారి తరఫు న్యాయవాది కోర్టును గడువు కోరారు. అనుమతించిన న్యాయస్థానం విచారణను ఈనెల 11కు కోర్టు వాయిదా వేసింది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను ఆధారంగా తీసుకొని మర్డర్ పేరుతో దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీశారు. అయితే ఈ కథ తమను కించపరిచేలా ఉందని, చిత్రం విడుదలను అడ్డుకోవాలని నల్గొండ కోర్టులో ప్రణయ్ భార్య అమృత పిటిషన్ దాఖలు చేశారు.
ఇవీచూడండి: 'మర్డర్' నిజ జీవిత కథ అని చెప్పలేను: వర్మ