నల్గొండ జిల్లా, మిర్యాలగూడలోని ఈదుల గూడ కాలనీలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ మహిళతో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరించి వారికి ముద్ర వేసి క్వారంటైన్‌కు పంపారు. వారిని బయటకు వెళ్లకుండా చూసుకోవాలని పోలీసులు, వైద్యాధికారులకు జిల్లా ఎస్పీ రంగానాథ్ సూచించారు. ఆ ప్రాంతాన్ని కార్డన్ ఆఫ్ ఏరియాగా చేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
లాక్డౌన్ అతిక్రమిస్తే వదలొద్దు.. ఎస్పీ రంగనాథ్ ఆదేశాలు - Nalgonda SP Tour In Nalgonda, Miryalaguda Due to Corona new cases Found
కరోనా వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తున్నందున జిల్లాస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఒక్కకేసు నమోదైనా ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నల్గొండ జిల్లాలో ఎస్పీ పర్యటన