కాల్వ నిర్మాణ పనుల్ని అడ్డుకునేందుకు సైట్ ఇంజినీర్‌ను తుపాకీతో బెదిరించిన మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు... నల్గొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు.
చిట్యాల మండలం ఉరుమడ్లలో చోటుచేసుకున్న ఘటనతో స్థానిక పోలీస్ ఠాణాలో ఆదివారం నాడు కేసు నమోదు చేసి... విచారణ నిర్వహించినట్టు తెలిపారు. ఆత్మరక్షణ కోసం కేటాయించే ఆయుధాలను ఇష్టమొచ్చినట్లు వాడితే... ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 51 లక్షలు దాటిన కరోనా కేసులు