ETV Bharat / city

సాగర సమరం: ప్రత్యర్థి పార్టీల తీరును విమర్శిస్తూ పోటాపోటీ ప్రచారం

author img

By

Published : Apr 6, 2021, 4:19 AM IST

ప్రత్యర్థి పార్టీల తీరును విమర్శిస్తూ తమ హయాంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ.. సాగర్‌ ఉపఎన్నికలో అన్ని పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్నాయి. సీనియర్ నేతలు, అభ్యర్థులు ఊరూరా తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో పార్టీలు తలమునకలయ్యాయి.

nagarjuna sagar by election campaign going to peek in day by day
ప్రత్యర్థి పార్టీల తీరును విమర్శిస్తూ పోటాపోటీ ప్రచారం

నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వచ్చే నెల నుంచి అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు అందుతాయని మంత్రి జగదీశ్ రెడ్డి.. ఉపఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్ అభివృద్ధి కోసం భగత్‌ను గెలిపించాలని కోరారు. అభ్యర్థిని వెంటబెట్టుకుని పెద్దవూర మండలం ఊరబాయి తండా, బెత్తల తండా, చలకుర్తిలో మంత్రి ప్రచారం చేశారు. అభ్యర్థి భగత్.. జునూతల, చలకుర్తి, కుంకుడుచెట్టు తండాలో ఓట్లు అభ్యర్థించారు. పెద్దవూర మండలం ఉట్లపల్లి, పర్వేదుల గ్రామాల్లో ఎమ్మెల్యే బాల్కసుమన్‌ ధూంధాం నిర్వహించారు. త్రిపురారంలో పర్యటించిన మంత్రి తలసాని.. కులవృత్తులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని వివరించారు.

నాగార్జున సాగర్ ఎన్నికలను ఒక ఉపఎన్నిక మాదిరి చూడొద్దని.. ప్రతి నాయకుడు, కార్యకర్త పూర్తిస్థాయిలో కష్టపడి జానారెడ్డిని గెలిపించుకోవాలని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల నేపథ్యంలో జూమ్‌లో.. మండల ఇంఛార్జిలతో సమావేశమైన ఏఐసీసీ ఇంఛార్జి మానిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సాగర్ కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిలు వారికి దిశానిర్దేశం చేశారు. జానారెడ్డి విజయం ఖాయమైందని, ఇక్కడ భాజపా పోటీలోనే లేదని కాంగ్రెస్‌, తెరాసల మధ్యనే పోటీ ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెరాస, భాజపాలు చీకటి ఒప్పందంలో భాగంగానే బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. అనుముల మండలం రామడుగులో పర్యటించిన జానారెడ్డి.. తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. సీనియర్ నేతలు సీతక్క, మల్లురవి... పెద్దవూరలో సమావేశం నిర్వహించారు. జానారెడ్డి వయసును ప్రస్తావిస్తున్న తెరాస నేతలు.. రాజకీయాల్లో కేసీఆర్ వయసును కూడా దృష్టిలో పెట్టుకోవాలని సీతక్క వ్యాఖ్యానించారు.

ఉప ఎన్నికల ప్రచారంపై భాజపా అధిష్ఠానం దృష్టి సారించింది. నాగార్జున సాగర్‌లోని విజయ విహార్ లోని మీటింగ్ హాల్లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, మండల ఇంచార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో.. రాష్ట్ర భాజపా బాధ్యుడు తరుణ్ చూగ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇక పెద్దవూర మండలంలో భాజపా అభ్యర్థి రవి నాయక్ ఇంటిoటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తెదేపా అభ్యర్థి మువ్వా అరుణ్ కుమార్.. త్రిపురారం మండలం నీలాయిగూడెం, అంజనపల్లి, అల్వాలపాడు, చెన్నాయిపాలెం, బడాయిగడ్డలో తిరుగుతూ ఓట్లేయాలని కోరారు.

ఇవీ చూడండి: గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సాగర్​ అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.