ETV Bharat / city

'దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తాత్కాలికమైనవే' - ghmc elections updates by komatireddy venkata reddy

మొన్న దుబ్బాక.. నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తాత్కాలికమైనవేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస, భాజపాలు.. హిందు, ముస్లిం అని కుల మతాలను రెచ్చగొట్టి, హైద్రాబాద్ అభివృద్ధి పక్కన పెట్టి ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారని ఆరోపించారు.

mp komatireddy venkatareddy on ghmc elections
'దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తాత్కాలికమైనవే'
author img

By

Published : Dec 4, 2020, 4:43 PM IST

గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, అమిత్ షా, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రులను దించి మతప్రాతిపదిక ఎన్నికలుగా మార్చారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తాత్కాలికమైనవేనని ఎంపీ అన్నారు. దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు ఐదు సార్లు పోటీ చేసి ఓడిపోవడంతో సానుభూతితో గెలిచారన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలోనే ఉన్నట్లు పార్టీ కార్యకర్తలకు గుర్తుచేశారు. హైదరాబాద్‌లో మెట్రో నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. ఈ మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

'దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తాత్కాలికమైనవే'

"రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు అభివృద్ధి చేసింది కాంగ్రెసే. తప్పకుండా రాష్ట్రంలో, దేశంలో మళ్లీ కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతుల పొట్ట కొట్టేవిధంగా ఉన్నాయని.. దిల్లీలో లక్షలాదిమంది రైతులు చేస్తున్న ఉద్యమానికి మా మద్దతు ఉంటుంది. రాష్ట్రంలో కూడా అలాంటి రైతు ఉద్యమం రావాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలంటే సాధ్యం కాదు. ప్రభుత్వం చెప్పిన సన్నాలే వేస్తే రెండు మాసాల నుంచి కొనుగోలు లేక మిర్యాలగూడ, నల్గొండ జిల్లాల్లో మిల్లర్ల దగ్గర అవస్థలు పడుతుంటే ఏ ఒక్క నాయకుడూ పట్టించుకోలేదు. ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, ఎట్లా మోసాలు చేయాలనే ఆలోచన తప్ప రైతుల అభివృద్ధి గురించి సీఎంకు పట్టింపే లేదు."

-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ

నల్గొండ జిల్లా శ్రీశైలం సొరంగమార్గం, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుల మీద రైతులతో ఉద్యమం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. డిండి, నక్కల గండి ప్రాజెక్టులు మొదలు పెట్టి ఏడేళ్లయినప్పటికీ వాటి ఉసేలేదన్నారు. కాళేశ్వరం, కొండపోచమ్మ కాలువల ద్వారా తన 40ఎకరాల ఫామ్ హౌస్‌కు తప్ప వేరే ఎకరాకు కాలువ తీసిన దాఖలాలు లేవని విమర్శించారు. నల్గొండ జిల్లాను దత్తత తీసుకుంటానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి లేదని... రోడ్లన్నీ గుంతలుగా మారాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 13 స్థానాల్లో గులాబీ అభ్యర్థుల జయకేతనం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.