ETV Bharat / city

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కందుల కొనుగోలు కేంద్రం పునః ప్రారంభం - నల్గొండలో కందుల కొనుగోలు కేంద్రం పునః ప్రారంభం

కందులు కొనుగోలు కేంద్రం మూసివేయడం పట్ల ఈటీవీ భారత్ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. నల్గొండలోని బత్తాయి మార్కెట్​లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని పునః ప్రారంభించారు.

lentals purchase center reopen in nalgonda with etv bharat effect
ఎఫెక్ట్: కందుల కొనుగోలు కేంద్రం పునః ప్రారంభం
author img

By

Published : Mar 18, 2020, 6:11 PM IST

కందుల కొనుగోలు కేంద్రాన్ని మూసివేయడం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని.. 'పంట అమ్మాలంటే రుజువు చూపించాలట' అనే శీర్షికతో ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. నల్గొండ ఎస్​ఎల్​బీసీలోని బత్తాయి మార్కెట్​లో కట్టంగూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రం తిరిగి ప్రారంభించారు.

రైతులకు టోకెన్లు ఇచ్చి కొనుగోలు చేయకుండానే సెలవు ప్రకటించారు. రైతులు మార్కెట్​కు భారీ ఎత్తున కందులు తీసుకొచ్చారు. కానీ అప్పటికే సెలవు ప్రకటించినట్టు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై ఈటీవీ భారత్​లో ప్రచురించిన కథనానికి స్పందించిన అధికారులు కందుల కొనుగోలు పునః ప్రారంభించారు. ఇప్పుడు కూడా రేపటి వరకే కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించారు. ఇంకా చాలా మంది రైతులు ఉన్నందున గడువు పొడిగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఎఫెక్ట్: కందుల కొనుగోలు కేంద్రం పునః ప్రారంభం

ఇదీ చూడండి: పంట అమ్మాలంటే రుజువు చూపించాలట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.