Komatireddy Tweet on GO 246: తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటి కేటాయింపునకు జారీ చేసిన జీవో 246ను వ్యతిరేకిస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది ఏళ్లుగా తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నెల 18న ఈ జీవో జారీ చేశారని.. అది నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎస్‌ఎల్‌బీసీ ద్వారా జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 246ని తెచ్చిందని.. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి ట్విటర్లో ఆరోపించారు. కృష్ణా నది నుంచి ఏపీ సీఎం జగన్ 8 నుంచి 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జీవో నెంబరు 246ని వెంటనే రద్దు చేయాలని.. లేదంటే జిల్లా కేంద్రంలో దీక్షకు సిద్దమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. జీవో రద్దు చేయాలని సీఎంకి లేఖ రాస్తానని.. అవసరమైతే అపాయింట్‌మెంట్ తీసుకుని కలుస్తానన్నారు. ఎస్‌ఎల్‌బీసీకి 30టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికి 40, డిండి ఎత్తిపోతలకు 20 టీఎంసీల నీరు కేటాయించాలని వెంకట్‌రెడ్డి ట్విటర్ ద్వారా డిమాండ్ చేశారు.
-
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 8 ఏండ్లుగా తెలంగాణా రైతాంగానికి అన్యాయం చేస్తుంది. జీవో నం 246 తో నల్గొండకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కేటాయిస్తూ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
నల్గొండ - మహబూబ్ నగర్ మధ్య కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
1/2 pic.twitter.com/Ulm1aronw3
">తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 8 ఏండ్లుగా తెలంగాణా రైతాంగానికి అన్యాయం చేస్తుంది. జీవో నం 246 తో నల్గొండకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కేటాయిస్తూ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 30, 2022
నల్గొండ - మహబూబ్ నగర్ మధ్య కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
1/2 pic.twitter.com/Ulm1aronw3తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 8 ఏండ్లుగా తెలంగాణా రైతాంగానికి అన్యాయం చేస్తుంది. జీవో నం 246 తో నల్గొండకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కేటాయిస్తూ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 30, 2022
నల్గొండ - మహబూబ్ నగర్ మధ్య కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
1/2 pic.twitter.com/Ulm1aronw3
ఇవీ చదవండి: