రైల్వేలైన్ కోసం పోరాడుతా: ఉత్తమ్ తనను ఎంపీగా గెలిపిస్తే చిట్యాల నుంచి కోదాడ, సూర్యాపేట మీదుగా విజయవాడ వరకు రైల్వేలైన్ కోసం పోరాడుతానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బ్యాలెట్ విధానంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓడిపోవడం, ఈవీఎంలతో నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్నికల్లోగెలవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్కు కొత్తేమి కాదన్నారు. వలసల వల్లపీసీసీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు.
ఇవీ చూడండి:ఖరారైన రాహుల్ పర్యటన, ఒకే రోజు 3 సభలు