మారుతీరావు అంత్యక్రియలకు రాకుండా ఆయన బంధువులు అడ్డుకున్న నేపథ్యంలో మిర్యాలగూడ అమృత నోరు విప్పింది. మారుతీరావు ఆత్మహత్య తర్వాత మీడియా ముందు పెద్దగా స్పందించని ఆమె.. అంత్యక్రియల అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడింది.
మిర్యాలగూడలోని తన అత్తింటి దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. భర్త, పిల్లలు సర్వస్వం... దూరమైతే ఎవరైనా ఒంటరిగానే మిగలాల్సి వస్తది. బంధువులు, పక్కవాళ్లు ఎవరు చూసినా.. పది రోజులు, ఆరు నెలలు, మహా.. అంటే ఏడాది. ఆ తర్వాత వాళ్లను ఎవరూ పట్టించుకోరని అంది. అమ్మ ఇప్పుడు ఒంటరింగా మిగిలింది. నా దగ్గరికి వస్తే.. ఆమె బాధ్యతలు తనే తీసుకుంటాను అన్నది. కుటుంబాన్ని వదిలి రావటం కుదరదని, అమ్మే తన దగ్గరికి రావాలని కోరింది. మారుతీరావు ఆస్తులపై తనకు ఆసక్తి లేదంది.