యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ హత్య కేసుల విచారణ ఈ నెల 6కు వాయిదా పడింది. మూడు కేసుల్లో నిందితుడికి వాంగ్మూలాలు వినిపించే ప్రక్రియ నేడు న్యాయస్థానం పూర్తి చేసింది. వాంగ్మూలాలు వినిపించి నిందితుడి అభిప్రాయాలను న్యాయమూర్తి నమోదు చేశారు. కుటుంబ సభ్యులెవరూ వెంట రానందున సాక్షులెవరూ లేరని కోర్టు నిర్ధారించింది. ఇంకెవరినైనా తీసుకువస్తారా అని నిందితుడి తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి తరఫున సాక్షులెవరూ లేరని న్యాయస్థానం తేల్చింది.
ఇవీ చూడండి : ఆస్తి దక్కనివ్వట్లేదని తండ్రి చంపిన తనయుడు